రాష్ట్రపతి భవన్ లో శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు…

 

ఓబులదేవచెరువు , జనసేన ప్రతినిధి, నవంబర్ 14:

 

భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు సంస్థలకు చెందిన పిల్లలు రాష్ట్రపతి భవన్ లో దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి బాలల దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

*పుస్తకాలే నిజమైన స్నేహితుల నా ముర్ము*

అనంతరం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ ఆర్ బి సి సి లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవచెరువు నుంచి శ్రీ విజ్ఞాన్ సీబీఎస్సీ పాఠశాల విద్యార్థులు హాజరైనారు. వెళ్లిన విద్యార్థులు మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన్ సీబీఎస్సీ స్కూల్ తరపున చిల్డ్రన్స్ డే రోజున వెళ్లి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలవడం మాకు ఎంతో ఉత్సాహం నింపిందని ఈ సందర్భంగా పిల్లలు చెప్పడం విశేషం. మరొక్కసారి ఇలాంటి అవకాశం దొరికితే వెళ్లేందుకు మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియపరిచారు. అంతేకాకుండా మా చదువు పట్ల, పిల్లగా డిసిప్లిన్, పట్ల శ్రీ విజ్ఞాన్ సీబీఎస్సీ స్కూల్ యాజమాన్యానికి ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ ట్రిప్ సందర్భంగా మా స్కూల్ చైర్మన్ మస్తాన్ మాపై ఆప్యాయతను అనురాగాన్ని ఆనందాన్ని పంచుకోవడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. మా చైర్మన్ మస్తాన్ మరియు ప్రిన్సిపాల్, మరియు వైస్ ప్రిన్సిపల్ అలాగే ఈ ఢిల్లీ ట్రిప్ కు సహకరించిన ఉపాధ్యాయులు మరియు నాతోటి విద్యార్థులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడం విశేషం. చిల్డ్రన్స్ డే రోజున రాష్ట్రపతి మాట్లాడుతూ పిల్లలే దేశ భవిష్యత్తు తరచుగా చెబుతూఉంటాం ఈ భవిష్యత్తును కాపాడుకోవడం, వారి సరైన ఎదుగుదలని నిర్ధారించడం మనందరి కర్తవ్యం అన్నారు. నేటి చిన్నారులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎంతో సమాచారం, విజ్ఞానం అందుబాటులో ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ పిల్లలు దేశ విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని, మన పిల్లల ప్రతిభకు సరైన దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. పిల్లలకు సున్నితత్వం ఎక్కువగా ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖపడతారు, ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషిస్తారని చెప్పారు. పిల్లల్లో ఉండే ఈ గుణం కారణంగా, మనం ఇతరులకుసహాయం చేయడానికి,పర్యావరణం పట్ల ప్రేమ గౌరవాన్ని కలిగి ఉండడానికి బాల్యం నుండి వారిని పేరేపించగలగాలన్నారు. ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించి పూర్తి అంకితభావంతో కష్టపడి తమ లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటే వారు కచ్చితంగా తమ లక్ష్యాన్ని చేరుకోగలరని రాష్ట్రపతి పిల్లలకు చెప్పారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఆమె వారితో సూచించారు. పుస్తకాలు మంచి స్నేహితులుఅన్నారు. మంచి పుస్తకాల వ్యక్తిత్వంతో సానుకూల మార్పులను తెస్తాయని ఆమె పేర్కొన్నారు. గొప్ప వ్యక్తులకు జీవిత చరిత్రను చదవాలని ఆమె పిల్లలకు సూచించారు. పిల్లలలో స్ఫూర్తితో పాటు సవాలను ఎదుర్కోవడంలో పుస్తకపఠనం వారికి సహాయపడుతుందని చెప్పారు. ఈ వేడుకలకు శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ కట్టుబడి మస్తాన్ ఉపాధ్యాయులు షమీ, ఫయాజ్ బేగం తో పాటు విద్యార్థులు రోద్దం సాహితీ ప్రియా, కే. షోయబ్, నవీద్, దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.