యాడికి మండల కేంద్రంలోని భరతజాతి ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ నేతాజీ జయంతి సందర్భంగా విజన్ హైస్కూల్లో లో ఘనంగ నేతాజీ జయంతి వేడుకలు..

న్యూస్.9)

 

యాడికి మండల కేంద్రంలోని విజన్ హై స్కూల్ నందు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు ఘనంగ నిర్వహించడం జరిగింది.మొదట ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు…తదుపరి ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఆయన పాత్ర గురించి వివరిస్తూ ఆయన బ్రిటిష్ ప్రభుత్వం 54 దేశాలకు నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షలో 4 వ స్థానంలో నిలిచిన గొప్ప మేధా సంపత్తి కల్గిన వ్యక్తి భారతీయ ప్రజలను బానిసత్వం నుండి విడిపించుటకు నడుం బిగించి మన స్వాతంత్రం మనం అడుక్కోకూడదని లాక్కుంటేనే అది సాధ్యమవుతుందని అనేక మంది భారతీయులకు ప్రేరణ కల్పించి “అజాద్ హింద్ ఫౌజ్” సైనిక సంస్థను స్థాపించి పోరాటం చేశారని….రెండో ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి భారత దేశ స్వాతంత్ర్యం సాధన కొరకు పునాదులు వేసిన వ్యక్తి నేతాజీ అని విద్యార్థులకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.