జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ యాడికి మండల కేంద్రంలోనిబొంబాయి రమేష్ నాయుడు….

న్యూస్.9)

యాడికి: యాడికి మండల కేంద్రం గ్రామ పంచాయయితీ కార్యాలయంలో 2వ సచివాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, హాజరయ్యారు మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు మాట్లాడుతు సీఎం జగన్ మోహన్ రెడ్ది గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమం వలన గ్రామ ప్రజలకు చాలా మేలు చేకూరుతుంది అని అనంతపురం నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ తో ప్రత్యేక చికిత్సలు చేస్తూ ఏదైనా అనారోగ్య స్థితి ఉన్నట్లుగా అయితే వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుంది అని తెలిపారు కావున ఈ అవకాశాన్ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మెంపు పొందుతున్న వైస్ జగన్ మోహన్ రెడ్డి గారినే మళ్ళీ సీఎం గా చేసుకోవాలని కోరారు.మరియు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పండు అనురాధ,ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు , వార్డ్ సభ్యులు గుంత తిరుపతి, గజ్జి బాల పెద్దయ్య, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,ఎస్సీ సెల్ కన్వీనర్ పండు శ్రీరాములు,వైద్య సిబ్బంది, వాలంటీర్స్, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.