వెంకటాపురంలో భారీ స్థాయిలో పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి..

వెంకటాపురంలో భారీ స్థాయిలో పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి

 

జనసంద్రంగా మారిన వెంకటాపురం

ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన ఒక శక్తి అని ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ అన్నారు బుధవారం తాడిమర్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెంకటాపురం పరిటాల రవీంద్ర 19 వర్ధంతి కి తరలి వెళ్లారు రామగిరి మండలం వెంకటాపురంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, తెలంగాణ, లండన్ వంటి ప్రాంతాల్లో పరిటాల రవి 19వ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు. వెంకటాపురంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ రవికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పరిటాల సునీత, శ్రీరామ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని.. రవితో గడిపిన క్షణాల గురించి స్మరించుకుని ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఘట్ వద్ద నివాళుర్పించారు. అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .