దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపాలిటీ దగా.. – అక్రమాలకు అడ్డాగా మణుగూరు మున్సిపాలిటీ..

  • దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపాలిటీ దగా
  • – అక్రమాలకు అడ్డాగా మణుగూరు మున్సిపాలిటీ
  • – బిల్లులు కమిషనర్ పేరిట.. చెక్కులు బినామీ కాంట్రాక్టర్ పేరిట : సామాజిక కార్యకర్త కర్నె రవి

 

మణుగూరు : తవ్వే కొద్ది మణుగూరు మున్సిపాలిటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. పనిచేసేది ఒకరైతే ఫలితం పొందేది మరొకరన్న చందంగా, మణుగూరు మున్సిపాలిటీ అవినీతి కంపులో కూరుకుపోయిందని సామాజిక కార్యకర్త కర్నె రవి విమర్శించారు. 2023 లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 05-06-2023 నుండి 16-06-2013 వరకు మణుగూరు మున్సిపాలిటీలో దొంగ బిల్లులు సృష్టించి అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ పేరిట ₹.2,95,700 బిల్లులు కాగా, చెక్కుల పేరిట ₹. 4,53,260 బినామీ కాంట్రాక్టర్ పేరిట సృష్టించి, అక్షరాల ₹. 1,57,660 ప్రజాధనాన్ని దోచుకున్నారని అన్నారు. ఈ విషయమై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.