గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంకమ్మ తల్లి మీద ఒట్టు వేసి ఓట్లు దండుకొని గెలిచిన తరువాత ఒట్టు గడ్డుమీద పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి

న్యూస్ నైన్ టీవీ

 

గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంకమ్మ తల్లి మీద ఒట్టు వేసి ఓట్లు దండుకొని గెలిచిన తరువాత ఒట్టు గడ్డుమీద పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి కి ఈ ఎన్నికల్లో ప్రజలు విశ్రాంతి కల్పించి ఇంట్లో కూర్చొని బెడతారని వెంకటగిరి, గూడూరు నియోజకవర్గల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి,మెరిగ మురళీధర్ ఆరోపించారు.. ఆదివారం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పోతుకొండ అంకమ్మ తల్లిని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి తో కలసి వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి,మెరిగ మురళీధర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాపూరు నిర్వహించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు అనంతరం నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా దైవా సన్నిధిలో ఒక్క మాట చెప్పితే దానికి కట్టుబడుతారని,కానీ వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాత్రం దేవుడు మీద ప్రమాణం చేసి అవసరం తీరాక మాట తప్పడం అతని నిజం అని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మండిపడ్డారు,ఫుట్ బాల్ పగలు అడుతారని ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి మాత్రం చీకట్లో ఫుట్ బాల్ అడలనుకొని బొల్లా పడ్డారని ఆయన ఆరోపించారు.. వెంకటగిరి నుంచి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచే ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి చేతిలో భారీ ఓట్లతో ఓడిపోయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారన్నారు..రాష్ట్రంలో ఒక్కే సారి 175 అసెంబ్లీ,25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు..పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా న్యాయం చేస్తారన్నారు..