న్యూస్. 9)
యాడికి తహశీల్దార్
యాడికి మండలంలో శాంతిభద్రతల నిమిత్తం రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉండాలని ఆదేశిస్తూ తహశీల్దార్ మోహనవల్లి సర్క్యులర్ జారీ చేశారు. గ్రామాల్లో సమావేశాలు, ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎవరిరైనా ఇళ్ల వద్ద రాళ్లు, కట్టెలు, ఇనుపసామగ్రిని తోలించి ఉంటే వారితో మాట్లాడి తీసివేయించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ సిబ్బంది ఎవరూ సెలవులు అడగకూడదని సర్క్యులర్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.