ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన..

న్యూస్. 9)

యాడికి:స్టార్ హాస్పిటల్(యాడికి) -మార్క్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ (అనంతపురం) ఆధ్వర్యంలో సోమవారం యాడికిలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అనంతపురం నుండి వచ్చిన వైద్యులు రోగులను పరీక్షించారు.ఉచిత వైద్య శిబిరంలో గుండె దడ, గుండె నొప్పి,ఆయాసం, కళ్లు తిరగడం, గుండెలో మంట వంటి సమస్యలతో భాధ పడుతున్న రోగులను పరీక్షించారు.సుమారు 140మంది రోగులు వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ మేనేజ్ మెంట్,వైద్య సిబ్బంది,మార్క్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు పాల్గొన్నారు