ఘనంగా పండిట్ దినదయాల్ జయంతి..

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోనిబిజెపి పార్టీ ఆధ్వర్యంల ఈరోజు తాడిపత్రి అసెంబ్లీ కో కన్వీనర్ పొట్టే గంగాధర్ ఆధ్వర్యంలో

భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా చేయడం జరిగినది. ఆయన 1916లో సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ఉన్న చంద్రబాన్ లో జన్మించారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఏనలేనివి. ఆయన చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ లో చేరి క్రమశిక్షణ అలవర్చుకున్నారు. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయారు. విశ్వ మానవాళిని ఆయన దృష్టిలో ఉంచుకొని ఏకాత్మకత మానవతవాదం తో మెలగాలని ఆయన రచించారు. వ్యక్తి గుణం గొప్పది అయితే, సమాజ అభివృద్ధిలోకి వస్తుంది అని ఆయన చెప్పారు. దేశ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అంత్యోదయ విధానంతో సమాజంలో అట్ట డుగున ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలని మానవాళికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది

.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు

జిల్లా ఓబీసీ కార్యదర్శి తలారి ఆంజనేయులు

ఉపాధ్యక్షులు రఘువీరాచారి వద్ది రాజశేఖర్ జయ రాముడు S C మోర్చ అధ్యక్షులు వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సుభాష్ చంద్రబోస్

కార్యకర్తలు పాల్గొన్నారు.