అగాపే ఆశ్రమంలో మాజీ సర్పంచ్ అన్నదానం…

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో.కీర్తిశేషులు.బాల కమ్మగిరి స్వామి కుమారుడు మాజీ సర్పంచ్ బాల రమేష్ బాబు అగాపే ఆశ్రమంలో ఉన్న వృద్ధులు అనాధలను చూసి చాలామంది దాతలు రావడం, చూసి అన్నదానం చేయడం, ఏదో ఒక విధంగా వారికి సహాయం చెయ్యడం ఇవన్నీ చూసి నేను కూడా నా వంతుగా ఏదైనా చేయాలని వెంటనే నా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి అగాపే ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించి అందరికీ అన్నదానం చేయాలని.అలాగే ఆశ్రమానికి ఫ్యాన్లు తక్కువగా ఉన్నాయని మాజీ సర్పంచ్ బాల రమేష్ బాబు నేను ఇస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య బాల రమాదేవి పెద్ద కూతురు విజయశ్రీ, అల్లుడు రాఘవ, మనవరాళ్లు, చిన్న కూతురు కౌశిక ఆయన సన్నిహితులు షేక్షవలి, సతీష్, చంద్రశేఖర్ రెడ్డి, ఆకుల మమ్మద్, పెయింట్ జన, బంధుమిత్రులు కూడా పాల్గొన్నారు. ఆశ్రమ పౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆయనకు ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.