Headlines

తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ కార్యదర్శి చెంచయ్య దగ్గరకి వెళ్తే నా కోరిక తిరిస్తే సర్టిఫికెట్ ఇస్తాను అని రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నారని గిరిజన మహిళ మల్లిక నాగలక్ష్మి వాపోయింది .. 

 

నెల్లూరు జిల్లా రాపూరు మండలం కోటురుపాడు గిరిజన కాలనీ కి చెందిన మల్లిక నాగలక్ష్మి తండ్రి శంకరయ్య1993 వ సంవత్సరంలో చనిపోగా ఆమె పంచాయతీ రికార్డులలో నమోదు చేపించకపోవడంతో ఆ సర్టిఫికేట్ కోసం పంచాయతీ కార్యదర్శి చెంచయ్య ను అడగగా అతను తన పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారని ఆమె తెలిపారు.. వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని,గూడూరు లో తనకు ఇళ్లు ఉందని అక్కడి రావాలని వస్తే ఐదు నిమిషాల్లో నీకు సర్టిఫికెట్ ఇస్తానని చెప్పడంతో విసుగుచెందిన సదరు మహిళ జిల్లా ఎస్పీ ని కలసి తన గోడు వెళ్లబోసుకుంది..జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా విచారించి న్యాయం చేస్తామని సీఐ చెప్పారని బాధిత మహిళ పేర్కొన్నారు