విజన్ లో ఘనంగా “జాతీయ విద్యా దినోత్సవం”..

న్యూస్. 9) యాడికి మండల కేంద్రంలోని

స్థానిక విజన్ హైస్కూల్ నందు భారత తొలి విద్యా శాఖా విద్యా మంత్రి శ్రీ “మౌలానా అబుల్ కలాం ఆజాద్” గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు….ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఉద్దేశించి ఆయన 1888 నవంబర్ 11 న జన్మించి స్వీయ విద్యాభ్యాసం చేశారని, అనంతరం “ఆల్ హిలాల్” పత్రికను స్థాపించి ఎంతో మందిని స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొనేలా ప్రేరణ కల్పించే కథనాలు రాశారని, ఆయన రచనలకు భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ పత్రికను కలకత్తా నుండి బహిష్కరించారని,అలాగే ఆయన హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడ్డారు అని అలాగే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన మొదటి విద్యా శాఖా మంత్రి గా ఎన్నికైన తర్వాత భారత విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తెచ్చి అనేక కళాశాలలు, విశ్వ విద్యాలయాలు స్థాపించి ఎంతో మంది పేద విధ్యార్తులకు ఉచిత ఉన్నత విద్యను అందించడంలో విశేష కృషి చేశారని….ఈ రోజు భారతీయులు ప్రతి దేశంలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారంటే విద్యారంగంలో ఆయన చేసిన గొప్ప సేవలే కారణం అని విద్యార్థులకు వివరించడం జరిగింది…. ఈ కార్యక్రమం లో విజన్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు…..