న్యూస్.9)
యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కాకర్ల కృష్ణవేణి వర్ధంతి నిమిత్తమై ఆమె కుమార్తె వనుము పద్మ, భర్త వనుముtv సత్యనారాయణ, కుమార్తె లిఖిత వీరి కుటుంబము అగాపే ఆశ్రమంలో వారికి భోజనాలు సిద్ధపరిచారు.వారిది విజయవాడ అయితే ఉద్యోగరీత్యా గత 20 సంవత్సరాలుగా యాడికి లో నివాసం ఉంటున్నారు. ఎంతోమంది ఆశ్రమానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాడం చూసిన వారు వారి వంతుగా, పద్మ అమ్మ జ్ఞాపకార్థమై ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు