న్యూస్. 9) యాడికి
నవంబర్ 14 వచ్చింది అంటే బాలలకు బోలెడు సందడి తెస్తుంది ఈరోజు అంటే పిల్లలకు పండుగ లాంటిది బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకల్లా జరుపుకుంటారు. నెహ్రూ కు పిల్లలన్న, గులాబీలు అన్న, అమితమైన ప్రేమ పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమాలిన ప్రేమ ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ” చాచాజీ” అని పిలుచుకుంటారు అందుకే 1889 నవంబర్ 14న నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవం గా జరుపుకుంటారు ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించబడడం ఆనవాయితీ. మండల కేంద్రమైన యాడికిలో ఐదవ నంబర్ ప్రభుత్వ పాఠశాలలో నాగమయ్య కుటుంబ సభ్యులు నేటి బాలురే రేపటి పౌరులు అని బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కేక్ కటింగ్ చేసి పిల్లలకు పలకలు, జామెట్రీ బాక్సులు, స్వీట్స్ అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వేశ్వర్ రెడ్డి, షేక్షావలి, విద్యా కమిటీ చైర్మన్ నాగరాజు, కూన వెంకటస్వామి, గూండా నారాయణస్వామి, మురళి, వంకం నాగరాజు, లక్ష్మీనారాయణ, వీరేష్ వీరాంజనేయులు, పవన్, అబ్దుల్లా, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు