న్యూస్ 9) యాడికి
శాఖా గ్రంథాలయం యాడికి నందు గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ. జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి మరియు బాలల దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథి E.O లక్ష్మణ్ చే పూలమాలవేసి కార్యక్రమం ప్రారంభించారు . ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు పంచాయతీ సెక్రటరీ హాజీ మరియు ఉపాధ్యాయులు కొత్త రాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో E.O లక్ష్మణ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు కొత్త రాయుడు మాట్లాడుతూ !ఈరోజు నెహ్రూ జయంతి రోజే బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నదని తెలియజేసినారు. కావున ఇదే రోజు గ్రంథాలయ వారోత్సవాలు కూడా జరుపుకుందురని విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు. హాజీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచే గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకుని పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం మంచి లక్షణంగా ఆయన పిల్లలకు సూచించరూఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఎం మధుసూదన్ , గ్రంథాలయ సిబ్బంది వినయ్ కుమార్, గ్రంథాలయ పాఠకులు రాజేష్, శ్రీనివాసులు , దత్తాత్రేయ, రాహుల్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు