Headlines

Editor

పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేశారని, దీంతో ఆయనకు ఈ రాష్ట్రంతో బంధం తెగిపోయిందని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంగనగర్‌లోని పూడూరులో మంగళవారం నిర్వహించిన రోడ్‍షోలో బండి సంజయ్ మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‍ అంశంలో ఎమ్మెల్యే కవితపై కూడా విమర్శలు చేశారు. ‘రాష్ట్రానికి…

Read More

గుజరాత్​లో 182 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 40మందిపై క్రిమినల్​ కేసులు

గుజరాత్​లో 182 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 40మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఏడీఆర్​(అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) వెల్లడించింది. ఈ 40లో.. 29మందిపై మర్డర్​, రేప్​ వంటి తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. రేప్​.. అటెంప్ట్​ టు మర్డర్​..! ఇటీవలే ముగిసిన గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లతో ఘన విజయాన్ని అందుకుంది బీజేపీ. వరుసగా 7వసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్​ 17స్థానాలకు పరిమితమైంది. ఆప్​ 5 చోట్ల గెలిచింది. Gujarat…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విధ్వంసం సృష్టించిన మాండౌస్ తుఫాను బాధితులకు వారంలోగా పరిహారం…

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విధ్వంసం సృష్టించిన మాండౌస్ తుపాను తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లతో వర్షాలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను బాధితులను ఆదుకునే క్రమంలో కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సిఎం సూచించారు. పంట నష్టాన్ని అంచనా వేసే క్రమంలో బాధితులతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. నష్టపోయిన రైతులు ఎక్కడా రైతులు నిరాశకు…

Read More

మాండూస్ తుపాను(Cyclone Mandous) ప్రభావం, భారీ వర్షాలపై సీఎం జగన్(CM Jagan) సమీక్ష

మాండూస్ తుపాను(Cyclone Mandous) ప్రభావం, భారీ వర్షాలపై సీఎం జగన్(CM Jagan) సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా రైతులు నిరాశకు గురికాకుడదని జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని తెలిపారు. రంగుమారిన ధాన్య, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయలేదని మాట రావొద్దని స్పష్టం చేశారు. ‘తక్కువ రేటుకు కొంటున్నారని మాట ఎక్కడా వినిపించొద్దు. రైతులు బయట అమ్ముకుంటున్నామని…

Read More

పట్టాలెక్కనున్న 6th వందే భారత్ రైలు

దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుంది. దీంతో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతోంది. పైగా, ఈ రైళ్లు పగటిపూట నడుస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది. వందే భారత్ పేరుతో నడుస్తున్న ఈ రైళ్లు ప్రస్తుతం ఐదు రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. తాజాగా ఆరో వందే భారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడిచే…

Read More

తండ్రి కాబోతున్న రామ్ చరణ్, చిరు ట్వీట్ వైరల్!

మెగా అభిమానుల (Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), భార్య ఉపాసన (Upasana) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ నటుడు తాము మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. ఈ మేరకు రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కొణిదెల, ఉపాసన తల్లిదండ్రులు శోభన, అనిల్ కామినేని ట్విట్టర్ లో స్పష్టం చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి (Megastar chiru) ”తాను తాతను కాబోతున్నానంటూ” చేసిన ట్వీట్ టాలీవుడ్ సర్కిల్…

Read More

పవన్‌ కళ్యాణ్‌ “వారా‍హి” రిజిస్ట్రేషన్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనంపై గత కొద్ది రోజులుగా ఏపీలో రగడ జరుగుతోంది. యుద్ధానికి సిద్ధం అంటూ కొద్ది రోజుల క్రితం ట్విట్టర్‌లో తన ప్రచార రథం ఫోటోలను బయట పెట్టడంతో రగడ మొదలైంది. ఏపీలో అధికార వైసీపీకి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్‌పై దూకుడుగా విమర్శలు చేశారు. మాజీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్‌పై ఘాటైన విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా పవన్‌ కూడా కౌంటర్ ఇచ్చారు. పవన్‌…

Read More

ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రత

మాండూస్ తుపాను(Mandous Cyclone) బాధితులకు ఏపీ ప్రభుత్వం(AP Govt) సాయాన్ని విడుదల చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయం అందుకోనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు(Nellore), తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సాఅర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ఎలాంటి నష్టం జరగుకుండా తుపానుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మాండూస్(Mandous) తుపాను…

Read More

ఆరోగ్య రంగంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ కి అవార్డులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, భవిష్యత్తులోనూ సాధ్యం కాదనేలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో యూపీలోని వారణాసిలో యూనివర్సల్ హెల్త్ కవరేజి డే వేడుకలను శనివారం ప్రారంభించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో పాటు దేశంలోని ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులంతా హాజరయ్యారు. సదస్సులో భాగంగా మూడు అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం…

Read More

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాదు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామనీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం ఆందోళన కలిగించిందనీ, వరంగల్‌కి సంబంధించి ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం బాధగా వుందనీ కొండా సురేఖ వాపోయారు. తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రాధాన్యత కల్పించడమంటే తనను అవమానపరచడమేనని కొండా సురేఖ ఆవేదన…

Read More