Headlines

ఓరుగల్లు సిగలో మరో వన్నె..150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

ఓరుగల్లు నగరంలో భారీమువ్వెన్నెల జెండారెపరెపలాడింది. భద్రకాళి బండ్ పై జీడబ్ల్యూ ఎంసీ(greater warangal municipal corporation) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ లు పాల్గొన్నారు. రూ. 25 లక్షల వ్యయం.. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో భద్రకాళి బండ్‌పై ఈ జెండాను ఏర్పాటు చేశారు. 150 అడుగుల స్తంభానికి 48/32 సైజుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ జెండాను రిపబ్లిక్‌ డే సందర్భంగా ఎలక్ర్టిక్‌ మోటార్‌ ద్వారా పతాకాన్ని పైకి చేర్చి ఆవిష్కంచారు. జెండా పైకి వెళ్లడానికి పది నిమిషాల సమయం పడుతుంది. మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే జాతీయజెండా 150 ఎత్తులోకి వెళ్లడం జరుగుతుంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన దేశంలోనే అమలవుతుందన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.దాస్యం మాట్లాడుతూ.. అంబేదర్‌ ఆలోచన మేరకు సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం. దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని.. ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక 2016లో హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోకెల్లా అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 291 అడుగుల జెండాను సంజీవయ్య పార్కు లో ఏర్పాటు చేశారు. నగరంలోని అతి సువిశాలమైన ప్రదేశంలో ఈ జాతీయ జెండాను ఏర్పాటు చేయటంతో యావత్ జాతిలో దేశభక్తిని పెంపొందించటమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ అతిపెద్ద జాతీయ జెండా ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది.