బూర్గంపాడు డిసెంబర్ 27 న్యూస్ 9
మహిళా ఉచిత బస్సు ప్రయాణం పై పునరాలోచించాలి
ఆటో కార్మికుల సమస్యలు వారంలోగా పరిష్కరించాలి
టి ఏ టి యు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మారయ్య
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ పథకం పై పునరాలసించాలి. వారంలోగా ఆటో కార్మికులకు సరైన న్యాయం చేయాలి, అని బి ఆర్ టి యు అనుబంధ సంస్థ అయిన టిఏటియు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ఆటో కార్మికుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని నివేదికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఎలాంటి స్పందన రావడంలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆటో కార్మికుల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.