పత్రిక ప్రకటన
తేది:29.12.2023
నిర్మల్ జిల్లా శుక్రవారం
ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలో తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకుడు శ్రీయాన్ అన్నారు
శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకులు శ్రేయాన్ మాట్లాడుతూ అందరూ అభ్యర్థులు వారి వారి ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలు నిర్దేశించిన రిజిస్టర్ లలో రసీదులతో సహా వారు ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్ నంబర్లతో సహా సమర్పించాలని లేనిపక్షంలో తదుపరి ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారన్నారు. ఇప్పటినుండి వారం రోజులలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డీవోలు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎన్నికల ఖర్చుల సిబ్బంది పాల్గొన్నారు