Headlines

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాల అమలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి   తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు ..

పత్రికా ప్రకటన 30-12-2023

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాల అమలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శనివారం నాడు మణుగూరు లోని భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ బి టి పి ఎస్ (చిక్కుడుకుంట)

సందర్శనకు విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో పర్మినెంట్ కార్మికులతో పాటు సమానంగా సింగరేణి సంస్థకు సేవలు అందిస్తున్న కాంటాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని పది సంవత్సరాల క్రితం వేజ్ బోర్డు లో ఒప్పందం అయినప్పటికీ నేటికీ అమలు కాలేదని వారు వాపోయారు, తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు, చిరు జీతాలతో జీవితాలను వెల్లదీస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల చీకటి బ్రతుకులలో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపాలని వేతన పెంపుకు సత్వరమే చర్యలు చేపట్టాలని వారు ఆ వినతి పత్రంలో మంత్రి గారిని కోరినట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో యు శివరామకృష్ణ, డి సుధాకర్,పొడుతూరి ప్రసాద్, చిట్టిబాబు, సంజీవరావు, నాగేశ్వరరావు, గురుమూర్తి, శ్రీనివాస్, గోపి, ఎం వెంకటేశ్వర్లు, ఎస్.కె రజబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.