Headlines

రోటరీ క్లబ్ కదిరి వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాల పంపిణీ..

రోటరీ క్లబ్ కదిరి వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాల పంపిణీ.

 

రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి వారి ఆధ్వర్యంలో భారత్ ఐటిఐ విద్య సంస్థ చైర్మన్ మరియు రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి గారిచే స్థానిక ప్రభుత్వ పాఠశాల తలుపుల లో పదవ తరగతి చదువుతున్న 170 మంది విద్యార్థులకు యుటిఎఫ్ (UTF) ఉపాధ్యాయ సంఘం రూపొందించిన మాదిరి ప్రశ్నపత్ర పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి, విద్యార్థులందరూ ఉపాధ్యాయుల సహకారంతో ఈ ప్రశ్న పత్రాల పుస్తకాలను బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, గత ఆరు సంవత్సరాల నుండి పలు పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి సభ్యులు ఈ పుస్తకాలను అందజేస్తున్నారని, గత సంవత్సరం ఈ పుస్తకాలనుండి దాదాపు 80% శాతం ప్రశ్నలు పబ్లిక్ పరీక్షకు రావడం సంతోషం కలిగించిందని, కావున విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొని రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి సేవలను కొనియాడారు.