అధిక లోడ్ ను ఆపేదెవరు..

 

 

బూర్గంపాడు11 న్యూస్9

 

బూర్గంపాడు మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాక లోగల ఐటిసి పిఎస్పీడీ కర్మకారానికి ప్రధాన ముడిసరకు అయిన కర్ర బూర్గంపాడు మండలంలోని పరిసర ప్రాంతాలలో నుండి దిగుమతి చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పుల్ల ట్రాక్టర్లు రోజుకి వందలకొద్దీ వస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఐటిసికి దిగుమతి అయ్యే కర్రను విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లను వారికి అనుగుణంగా తయారు చేసుకుని అధిక లోడ్ ల ద్వారా ప్రమాదాలకు తెరలేపుతున్నారు.. గతంలో ఎన్నో మార్లు ట్రాక్టర్లు అధికలోడు వలన పల్టీ కొట్టి మరణి డ్రైవర్లు మరణించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి అయినప్పటికీ ఐటిసి యాజమాన్యం, ట్రాక్టర్ల యాజమాన్యం, పుల్ల కాంట్రాక్టర్లు డ్రైవర్ ప్రాణాలను పనంగా పెడుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న డ్రైవర్లు ప్రాణాలను లెక్కచేయకుండా ట్రాక్టర్ యజమానులు అధిక లోడ్ లను సైతం లెక్కచేయకుండా రవాణా చేస్తున్నారు…

 

*చలానాలను విధిస్తున్నప్పటికీ మారని తీరు…*

 

గత కొద్ది కాలంగా భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అధికలోడుతో వస్తున్న ట్రాక్టర్లను ఆపి చలానాలు విధిస్తున్నప్పటికీ తీరు మార్చుకోకుండా ఇష్టరాజ్యంగా ట్రాక్టర్ల పై లారీలకు వేసే లోడులను ట్రాక్టర్ పై సర్ది బరితెగించి రవాణా చేస్తున్నారు భద్రాచలం ఎంవిఐ తిరుపతి చలానాలు రాస్తున్నారని ముందుగానే పసిఘట్టిన బడా కాంట్రాక్టర్లు జాగ్రత్త పడి రాత్రి సమయంలో తోలకాలు సాగిస్తున్నారు…

 

 

*కర్ర కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న ఐటీసీ యాజమాన్యం*

 

ఓవైపు ఎంబీఐ తిరుపతి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం చలనం లేకుండా ఇష్టారాజ్యంగా అధిక లోడ్లను వేస్తూ రవాణా చేస్తున్న బడా కాంట్రాక్టర్లకు ఐటిసి యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుందని చెప్పవచ్చు. కర్రను అధికంగా రవాణా చేయడం కొరకుట్రాక్టర్లను వారి ఇష్టమైన శైలిలో తయారు చేసుకుని అధికంగా ట్రాక్టర్లను వారి ఇష్టమైన ఆకారంలో తయారు చేసుకొని రవాణా చేస్తున్నారు వీటన్నింటికీ ఐటిసి యాజమాన్యం సహకరించి వ్యాపారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని డ్రైవర్ ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు