ఆరెకటిక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చండి క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన సంఘం ప్రతినిధులు..

 

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో ఆరెకటిక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఆరెకటిక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చక పోవటంతో తాము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నామని పేర్కొంటూ సంఘం అధ్యక్షుడు గౌలికర్ రవీందర్ , ప్రధాన కార్యదర్శి గౌలీకర్ శైలేందర్ లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఆరెకటిక సూర్యవంశం సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను సంక్రాంతి సందర్భంగా శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆరెకటిక కులం వారిని ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తీర్మానం చేయించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గౌలికర్ రవీందర్, ప్రధాన కార్యదర్శి గౌలికర్, శైలేందర్, సలహాదారుడు జి ఆనంద్, యువత అధ్యక్షుడు దినేష్ కుమార్, సంఘం ప్రతినిధులు రాజేందర్, ఎం రామ్ కిషన్, ఇ. సురేందర్, కే .రామ్ లాల్ జీ, జే. బసంత్ రావు, హరి శంకర్, ప్రవీణ్, సతీష్ ,హీరాలాల్, లక్ష్మణ్ ,దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.