రైతుల మనోభావాలు కించపరిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి….

రైతుల మనోభావాలు కించపరిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి…..

 

నూనె కుమార్ యాదవ్

అధ్యక్షులు

BRS పార్టీ కొండపాక మండలం

 

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బారాస మండల అధ్యక్షుడు *నూనె కుమార్ యాదవ్* మాట్లాడుతూ రైతుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గార్లు రైతుబంధు అడిగే రైతులను చెప్పులతో కొట్టాలని అనడం కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల మనోభావాలను కించపరిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

*ఎద్దు ఏడ్చిన ఎవుసం – రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవని*

దేశానికి అన్నం పెట్టే రైతన్నను వీరి అధికార మదంతో చెప్పులతో కొట్టాలని దూషించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు గడవకముందుకే రైతుల జీవితాలతో చెలగాటం ప్రారంభం చేశారని, మీకున్న దురహంకార దుర్బుద్ధిని రైతులపై మీ అహంకారం చూపించి నోటికొచ్చినట్టు వాగితే త్వరలోనే మీపై రైతులు తిరగబడే సమయం వస్తుందని తెలిపారు.

 

సకాలంలో రైతుబంధు అందరికి అందించి, రైతు బీమా ను అలాగే కొనసాగించి, 24 గంటల ఉచిత విద్యుత్ను అందించి, నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించాలని *లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు* …. ఈ కార్యక్రమంలో బారస యువజన విభాగం అధ్యక్షులు చిక్కుడు భాను ముదిరాజ్, ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లె బాబు,మైనార్టీ నాయకులు Md. ముగ్ధుమ్, నాయకులు నేతి గణేష్, రాకేష్ గౌడ్, కేమ్మాసారం శ్యామ్,మెరుగు శివ, గుర్రాల రాజు తదితరులు పాల్గొన్నారు………