న్యూస్9: కప్రా మండల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలాజీ నగర్ ఆనంద్ నగర్ లో నివసిస్తున్న జిమ్ కోచ్ రమేష్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ తండ్రితో కలిసి ఆనంద్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. భార్య విడాకులు ఇవ్వడం, కూతురికి దూరం కావడంతో రమేష్ మనస్థాపానికి గురయ్యాడు. నాకు బ్రతకాలని ఉంది కానీ బలవంతంగా చనిపోతున్నాను అని సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.