అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి మీదా కేసు నమోదు…

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల. రవీందర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్, తెలంగాణ

 

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇనుముల సత్యనారాయణ మరియు అతనికి సహకరిస్తున్న రావికంటి సతీష్ అను వ్యక్తులపై పిర్యాదు రాగ కేసు నమోదు చేసిన మంథని ఎస్ ఐ డేగల రమేష్.

 

వివరాలలోకి వెళితే మంథని టౌనుకు చెందిన బిరుదు శ్రీనివాస్ అనే వ్యక్తి కి సూరయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 329 నందు ఇంటి స్థలం కలదు. ఇట్టి స్థలంలో BS banquet హాల్ నిర్మాణం చేసుకుంటున్న క్రమంలో మంథని కి చెందిన ఇనుముల సత్యనారాయణ తన గన్ మెన్ తో వచ్చి తనకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేనియెడల ఇట్టి నిర్మాణాన్ని అడ్డుకుంటానని బెదిరించినాడు. తరువాత రావి కంటి సతీష్ అనునతడు ఫిర్యాదు దారుడి దగ్గరికి వచ్చి ఇనుముల సతీష్ గురించి మీకు తెలియదు గతం లో ఆయన మంథనిలోని చాలా ఇంటి నిర్మాణాలను కోర్టులో ఫీల్ వేసి కూల్చినాడు. నువ్వు ఆయనతో పెట్టుకోకు నేను ఆయనతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఫిర్యాదుదారుడిని మరియు అతని స్నేహితుడిని హైదరాబాదులోని ఒక హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసినాడు. అక్కడ ఇనుముల సతీష్ వచ్చి ఫిర్యాదారున్ని నువ్వు 10 లక్షలు ఇవ్వకపోతే నీ BS banquet హాల్ కూల్చివేస్తానని ఇదేనా చివరి హెచ్చరిక అని బెదిరించినాడు. తర్వాత ఫిర్యాదు దారుడు మంథని కి వచ్చినాక అతనికి భయపడి 5 లక్షల రూపాయలను అతని స్నేహితుని అకౌంటు నుండి రావికంటి సతీష్ అకౌంట్ కి పంపినాడు. మిగతా ఐదు లక్షల గురించి ఇనుముల సతీష్ పదే పదే ఫిర్యాదుదారుడుని బెదిరించాడు.గత ఆగస్టు 20వ తేదీన ఇనుముల సతీష్ తన గన్ మెన్ మరియు రావీకంటి సతీష్ తో కలసి ఫిర్యాదు దారుడి BS banquet హాల్ లోకి వచ్చి మిగతా ఐదు లక్షల ఇవ్వకపోతే నీ హాల్ నీ కోర్టులో పిల్ వేసి కూల్చివేస్తానని బెదిరించాడు. ఇన్ని రోజులు ఫిర్యాదారుడు అతనికి భయపడి దరఖాస్తు ఇవ్వలేదు అని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడమైనది.

 

ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే అతనికి భయపడకుండా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి దరఖాస్తు ఇవ్వగలరని మంథని ఎస్ ఐ పత్రిక ద్యారా తెలియజేసారు.