అక్కినేని శతజయంతిని విజయవంతం చేయండి.. కొండెల మారుతి..

న్యూస్ 9tv రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్, తెలంగాణ..

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లో బుధవారం రోజున మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండెల మారుతి

అక్కినేని శత జయంతి పురస్కరించుకుని 100 సంవత్సరాల సాంస్కృతిక సవ్వడి కార్యక్రమాన్ని ఆహ్వానం పత్రికను ఆవిష్కరించారు.

అనంతరం కొండెల మారుతి మాట్లాడుతూ

ఈనెల 20 తేదీ న మంథని ఫ్రెండ్స్ క్లబ్లో నిర్వహించే తెలుగు సినీ పరిశ్రమ జగత్ ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పూరష్కరించుకొని (100 ) వంద సంవత్సరంల సంస్కృతిక సవ్వడి కార్యక్రమానికి మంథని నియోజక వర్గంలోని సినీ నటుల అభిమానులు యాక్టర్లు కవులు రచయితలు గాయకులు, నాట్య కళాకారులు సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంథని విద్యార్థి యువత కొండెల మారుతి కోరారు. 22వ తేదీ వర్ధిల్లు తెలంగాణ 18 వ శతజయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొని జైలు కేసులు పాలైన ఉద్యమకారులకు శాలువాతో సత్కారాలు చేస్తున్నట్టు వారితో పాటుగా నిజకవర్గంలోని గాయకులకు సినీనటి నటులు కళాకారులకు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి పునస్కరించుకొని వారికి అవార్డులతో పాటు సన్మానాలు చేస్తున్నట్టు

ఆయన తెలిపారు.

సమాజానికి మంచి చేసే సహోదయంతో సినీ పరిశ్రమ అభిమానులు నటినటులతో ఒక జాయింట్ కమిటీ ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ రామడుగు మారుతి, గాయకుడు గాండ్ల బాపు పాల్గొన్నారు.