మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి…సి ఐ టీ యు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్…

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని…

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం రోజున మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ లో పని చేస్తున్న కార్మికులకు గత 5 సంవత్సరాలుగా సబ్బులు, నూనెలు, చెప్పులు,దుస్తుల కూలి డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 1000 రూపాయల వేతనాన్ని మంథని మున్సిపాలిటీ లో అమలు చేయటం లేదని అన్నారు.NMR కార్మికులను కాంట్రాక్టు ఔటసోర్సింగ్ లో విలీనం చేయాలనీ రిక్షాలు ,ట్రాలీ ఆటోలను రిపేర్ చేయించాలని చనిపోయిన కార్మికుల కుటుంబానికి దహన సంస్కారాల కింద 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కార్మికులు చిప్పకుర్తి చందు, సింగరపు గట్టయ్య, ఎడ్ల పెల్లి రాజయ్య, బెజ్జల కమల, పోశమ్మ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.