- రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కృషితో కార్మికుల కళ్ళల్లో ఆనందం..
- మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో కాంట్రాక్టు కార్మికులకు 5000 బోనస్..
- కాంగ్రేస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య…
NewS 9 tv Reporter
Manthani, peddapalli
Karimnager, Telangana
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామం లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య మాట్లాడుతూ….
సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలో కానీ విని ఎరుగని చరిత్రలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కృషి ఆశీస్సులతో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 20,000 పైచిలుకు కాంట్రాక్టు కార్మికులకు 5000 బోనస్ ప్రకటించడం పట్ల కార్మికులు పూర్తిస్థాయిలో వారి కుటుంబాలతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన మినిమం వేజ్ బోర్డు అధ్యక్షులు జనక్ ప్రసాద్ కు కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనతి కాలంలోనే ఇటువంటి బోనస్ ప్రకటించటం పట్ల కార్మికులు ఆనందం మరియు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉండడం వలనే చిన్న సన్న కారు కార్మికులకు న్యాయం చేస్తున్నారని కార్మికులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పన్నూర్ తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్, మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్, మాజీ సర్పంచ్ వేప చెట్టు రాజేష్, మాజీ ఎంపిటిసి కన్నూరి నర్సింగరావు , గ్రామ శాఖ అధ్యక్షుడు మైదం బుచ్చయ్య, సీనియర్ నాయకుడు చింతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.