మల్కాజిగిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ సమస్యల పై సమావేశం ఏర్పాటు చేశారు. తొమ్మిదవ డివిజన్లో విద్యుత్ త్రీఫేస్ మరియు ట్రాన్స్ఫార్మర్ కొరత ఇతర కరెంటు సమస్యల మీద నియోజకవర్గ పరిధిలోని అన్ని సబ్ స్టేషన్లు ఏ.ఈ., డి.ఈ. మరియు ఏ.డి. స్థాయి అధికారులతో కార్పొరేటర్ లను మాజీ కార్పొరేటర్లు స్థానిక నాయకులను సమన్వయ పరుస్తూ విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు సమస్యలు పరిష్కరించేందుకు క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో డి.ఈ అన్వర్ పాషా, సుబ్బారెడ్డి, ఏ డి ఈ శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ ఏ.ఈ. లక్ష్మి, నాయకులు కార్పొరేటర్ విజయ శాంతి రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాము యాదవ్, అనిల్ కిషోర్, కరంచంద్, అమీనుద్దీన్, ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బైరు అనిల్,మౌసిన్ ఇబ్రహీం, మల్లేష్ గౌడ్, వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.