న్యూస్ 9 tv రిపోర్టర్
మంథని, పెద్దపల్లి..
చేరాల రవీందర్
9640420733..
సమాజాన్ని అన్నిరంగాలలో ముందుంచడం ఉపాధ్యాయులు విద్యార్థుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, అలాంటి బాధ్యతాయుతమైన తరాన్ని సమాజానికి అందించడంలో ఉపాధ్యాయులు నిరంతరం సఫతీకృతులు కావాలని జిల్లా విద్యాధికారి మాధవి పిలుపునిచ్చారు.
మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని ప్రాధమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు
ఈదులపల్లి నరసింహారావు తమ తండ్రి సత్యనారాయ రావు జ్ఞాపకార్థం టై, బెల్ట్, ఐడి కార్డులు వితరణ చేయగా అదే పాఠశాల ఉపాధ్యాయిని బి. హరిప్రియ తన పదవీ విరమణ సందర్భంగా షు వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి మాధవి ఏ ఎం ఓ షేక్ ఏర్పాటు చేసిన టై, బెల్ట్స్, ఐడి కార్డ్, షూ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా ర్థులను ఉద్దేశించి జిల్లా విద్యాధికారి మాధవి మాట్లాడుతూ……. పోటీ ప్రపంచంలో ఎలా రాణించాలో, అందుకు గాను ఏ విధమైన మెళకువలను అవలంబించాలో మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధనతోపాటు అనేక సదుపాయాలు అందుతున్నాయని ఆమె అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకోవాలని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. తన తండ్రి స్మారకార్థంగా విద్యార్థులను కార్పోరేట్ పాఠశాల కు దీటుగా తయారు చేయాలని ఉద్దేశంతో టైం బెల్టులు షూలు అందించడం అభినందనీయమన్నారు.
అకాడమిక్ మానిటరింగ్ అధికారి (ఎ.ఎమ్.వో) డా|| షేక్ మాట్లాడుతూ….ఎఫ్.ఎల్.ఎన్, లిప్ కార్యక్రమాలను అమలు జరపడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, వారి కృషి వల్ల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి ఈ తరహా ప్రయత్నాలు దోహదం చేస్తాయని అన్నారు. మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ వితరణ గావించిన ఉపాధ్యాయుల స్ఫూర్తితో మరింతగా సమాజ భాగస్వామ్యం పెరగాలని, పాఠ శాలను సమాజం తమ సొంత సంస్థ గా భావించినపుడు తప్పకుండా అక్కడ విద్యాపరమైన తుందని అన్నారు. కాగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఈదులపల్లి నరసింహారావు తమ తండ్రి సత్యనారాయణ రావు జ్ఞాపకార్థం టై, బెల్ట్, ఐడి కార్డులు వితరణ చేయగా, పాఠశాల ఉపాధ్యాయిని బి. హరిప్రియ తన పదవీ విరమణ సందర్భంగా షు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను డి.ఇ.వో, ఎ. ఎం.వో, ఎం.ఇ.వో తో సహా ఉపాధ్యాయులు, గ్రామస్థులు కొనియాడారు. అనంతరం డిఈఓ, ఏ ఎం ఓ, ఎం ఈ ఓ లను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ రషీదేవి, ఉపాధ్యాయులు వి. నరేష్, వామన మూర్తి, బి. నగేష్, శారద, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.