సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం అందించేందుకు చేపట్టిన “జగనన్నకు చెబుదాం” అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో భాగంగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు, జిల్లా ఎస్పీ శ్రీ శ్రీధర్ గారు, ఎమ్మెల్యే శ్రీ కొండేటి చిట్టిబాబు గారు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, హితకారిణి సమాజం చైర్మన్ శ్రీమతి కాశీ బాలముని కుమారి గారు, దృశ్య కలల అకాడమీ చైర్మన్ శ్రీమతి కుడుపూడి సత్య శైలజ గారు, అమలాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రెడ్డి సత్య నాగేంద్రమణి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు