యువగళం పాదయాత్ర దెబ్బకి వైసీపీ దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉందన్నారు. ‘అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?’ అని లోకేశ్ సవాల్ చేశారు. అబద్దానికి మానవ రూపం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక శాపం ఉంది.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుంది… అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెబుతాడు అని లోకేశ్ అన్నారు.
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు. టీడీపీ హయాంలో ఉన్న 1100 రియల్ టైం గవర్నెన్స్ ని జగన్ నిర్వీర్యం చేశాడని, పేరు మార్చి స్పందన అని పేరు పెట్టాడని ఎద్దేవా చేశారు. స్పందనలో ఎన్ని అర్జీలు పెట్టినా స్పందన లేదన్నారు. ఇప్పుడు దాని పేరు జగన్ కి చెబుదాం అని మార్చి కొత్త డ్రామా మొదలు పెట్టాడని విమర్శించారు.
Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అవినీతిలో తోపు: నారా లోకేశ్
తనకు ఆరు సమస్యలు ఉన్నాయని గోల్ మాల్ జగన్ కి చెప్పేదాం.. ఎప్పుడు పరిష్కరిస్తాడో చూద్దామని లోకేశ్ అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.. ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని.. నాలుగేళ్లు గడిచిపోయాయని..ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనాలని, ఎప్పటిలోగా కొంటారని నిలదీశారు. బీసీల్లో ఉన్న ఉప కులాలకు నిధులు కేటాయిస్తామన్నారు.. బీసీలకు చెందాల్సిన డబ్బులు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు కేటాయించిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని.. ఎప్పటి లోగా వాటిని తిరిగి ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 2019లో నందికొట్కూరు ఎమ్మెల్యే గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ధర్ ని భారీ మెజారిటీతో గెలిపించారని.. ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? అని అన్నారు.
Nara Lokesh : వైఎస్ జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేశ్.. జగన్ ఎలా స్పందిస్తారో..