ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో 1 వ సచివాలయ పరిధిలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలను వివరించి, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.