Headlines

తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తుకు గ్యారంటీ

తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తుకు గ్యారంటీ

వైసిపి ప్రభుత్వానికి సంపద సృష్టించడంపై కన్నా, అప్పులు తెచ్చుకోవడం పైనే దృష్టి అంతా….

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ,చంద్రబాబు నాయుడు గారి పాలన గ్యారెంటీ ఇస్తుందని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు…
కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జిలు సమావేశం వాడపాలెంలో జరిగింది… సమావేశంలో సత్యానంద రావు మాట్లాడుతూ
మహానాడులో మేనిఫెస్టో లో “భవిష్యత్తుకు గ్యారెంటీ” పేరిట ప్రకటించిన మొదటి మేనిఫెస్టో అద్భుతమని కొనియాడారు.

మహాశక్తి నామకరణంతో స్త్రీలకు పెద్దపీట వెయ్యడం హర్షనీయమని, తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15వేలు, రైతు సోదరులకు సంవత్సరానికి 20వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3వేలు, అంతేకాకుండా పేద ప్రజల భవిష్యత్తుకు సంబంధించి అనేక వరాల హామీలను ప్రకటించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేసారు.
జగన్మోహన్ రెడ్డి తన జేబులు నింపుకోవడానికి తప్ప ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించడం లేదు అన్నారు… దుబారాకు, అవినీతికే ప్రభుత్వ సంపద అంతా ఖర్చు చేస్తున్నారని, టిడిపి వస్తే ఆర్థిక క్రమశిక్షణ పాటించి, సంపద సృష్టించి ప్రభుత్వ ఆదాయం పెంచుతుందని సత్యానందరావు అన్నారు.. అభివృద్ధి తద్వారా ఆదాయం లభిస్తే వాటితో పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు..
సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివాసరావు, గుత్తుల పట్టాభిరామారావు, ముదునూరి వెంకటరాజు, మెర్ల గోపాలం క్లస్టర్ ఇన్చార్జిలు వంటిపల్లి సతీష్, ఈదల సత్తిబాబు, కరటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, పల్లి ఏసు, ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాథం, కాసా విజయ సాగర్, మాసాబత్తుల ఆనందరావు, జక్కంపూడి వెంకటస్వామి, రెడ్డి తాతాజీ,, మైగాపుల నాయుడు, కాసురెడ్డి, సలాది నాగేశ్వరావు, చవల జగన్నాథం, బండారు సంజీవ్, ముత్యాల బాబ్జి తదితరులు పాల్గొన్నారు..