యాడికి జూన్ 6 మండలంలో జరుగుతున్న రేషన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదని తెలుగుదేశం పార్టీ తరఫున యాడికి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది. రేషన్ పంపిణీలో బియ్యము చక్కెర కంది బేడలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ మండలంలో కందిబేళ్ల సరఫరా 25 శాతం మందికి మాత్రమే అందుతున్నాయని మిగతా 75 శాతం మందికి మొండి చేయి చూపిస్తున్నారని ప్రభుత్వం నుంచి 100% సరఫరా జరుగుతున్న డీలర్లు సరిగా పంపిణీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ వారు ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మార్వో తగు చర్యలు తీసుకొని రేషన్ పంపిణీ సక్రమంగా చేయించాలని కోరడం జరిగింది. వినతి పత్రం అందజేసిన వారిలో యాడికి టిడిపి మండల కన్వీనర్ గోర్తి రుద్రమ నాయుడు, దడియాల ఆది నారాయణ చిట్టెపు చంద్రశేఖర రెడ్డి, కోడూరు నీలకంఠారెడ్డి చంద్ర వంకం రాజు తదితర టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.