ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

యాడికి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సినీ నటుడు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందుగా కేక్ కట్ చేసి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు,టిడిపి నాయకులు మాట్లాడుతూ సినీ నటుడు బాలకృష్ణ సినిమాలో నటిస్తూ, రాజకీయాలలో రాణిస్తూ, మరోపక్క సంఘసేవ కార్యక్రమాలు చేయటంలో ముందుంటారన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని హైదరాబాదులో స్థాపించి వేలాదిమందికి ఉచిత వైద్యం అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం మండల అధ్యక్షుడు రంగడు, పట్టణ అధ్యక్షుడు కంచర్ల రాఘవేంద్ర, కార్యదర్శి కడ్డీల నాగేంద్ర, రామాంజి, టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, కులశేఖర్ నాయుడు, దడియాల ఆది, లక్ష్మణ్, నీలకంఠారెడ్డి, హరి, రామంజి, బాలచంద్ర, తిప్పారెడ్డిపల్లి ఆదినారాయణ, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు