రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు పుతిన్ కు భారీ రిలీఫ్ లభించింది. అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు ఫలితం ఇచ్చాయి. దీంతో రక్తపాతం లేకుండానే సాయుధ తిరుగుబాటు ముగిసింది.
రష్యాలో ఒక్క సారిగా మొదలైన ఉద్రిక్త పరిస్థితులు అంతే వేగంగా మారిపోయాయి. నాటకీయ పరిణామల మధ్య రష్యాల నగరాల్లో వాగ్నర్ దళాల ప్రవేశంతో ఒక్క సారిగా ఆందోళన పెంచాయి. తిరుగుబాటు నేతగా నిలిచిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఒక్కొక్క నగరాన్ని దాటుకుంటూ మాస్కోకు 200 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లింది.
దీనిని తిప్పి కొట్టేందుకు పుతిన్ సైన్యం అదే స్థాయిలో సిద్దమైంది. భారీగా సైనిక వాహనాలు..బలగాలను మొహరించింది. దీంతో భారీగా రక్తపాతం తప్పదని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసాయి. రష్యాలోని తమ పౌరులను పలు దేశాలు అప్రమత్తం చేసాయి. ఈ ఉద్రిక్తతలతో అధ్యక్షుడు పుతిన్ మాస్కోను వీడి బంకర్లలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.
ఈ సమయంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ముందుకు వచ్చారు. రష్యా ప్రభుత్వం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేసారు. ఉద్రిక్తతను సడించేలా ఫార్ములా ప్రతిపాదించారు.బలగాలను నిలువరించాలని కోరారు. దీని పైన ప్రిగోజిన్ కూడా టెలిగ్రాం ద్వారా తన సందేశాన్ని వినిపించారు