తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎక్కడికి వెళ్ళినా అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న కేసీఆర్ పట్ల అభిమానం చూపించేవారు, ప్రేమ చూపించే వారు అనేకమంది ఆయనకు తన పర్యటనలో తారసపడుతున్నారు.
అంతే కాదు వారు అపురూపమైన బహుమానాలు కూడా ఇస్తున్నారు.
బీజేపీకి కష్టకాలం; కేసీఆర్ కి కలిసొచ్చే కాలం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ఈరోజు రెండోరోజు పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు ఉదయాన్నే పండరీపూర్ కు చేరుకున్నారు. పండరిపూర్ లోని శ్రీ విట్టల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో రైతులు అంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రార్థించినట్టు పేర్కొన్నారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటన నేపథ్యంలో పలువురు మరాఠా భక్తులు సీఎం కేసీఆర్ ను చూడడానికి ఉత్సాహం చూపించారు. ఇక దైవదర్శనం చేసుకున్న అనంతరం కేసీఆర్ అక్కడ ఆలయ ఆవరణలోని దుకాణ సముదాయాలను చూస్తూ వెళుతున్న క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ భక్తుడు సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి విఠలేశ్వరుడు రుక్మిణి అమ్మవార్ల తో కూడి ఉన్న ప్రతిమను కేసీఆర్ కు బహూకరించారు.
ఆ వృద్ధుడు సీఎం కేసీఆర్ పట్ల ఉన్న తన ప్రేమను తన చిన్న బహుమానంతో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సీఎం కేసీఆర్ కూడా ఆ వృద్ధుని ప్రేమకు సంతోషపడ్డారు. ఎంతో వినమ్రంగా వృద్ధుడు ఇచ్చిన అపురూప ప్రతిమను స్వీకరించారు. ఆపై సీఎం కేసీఆర్ అక్కడ నుండి సమీప గ్రామంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
అక్కడి స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు. ఆపై మధ్యాహ్నం కేసీఆర్ మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవాని ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.