జమ్మూ/కాశ్మీర్: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని ఏకం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మన అన్ని పార్టీలు విజయం సాధించి నరేంద్ర మోదీని ఇంటికి పంపించి మనలో ఎవరో ఒకరు ప్రధాని కావాలని చర్చలు జరిపారు.
ఇప్పుడు వివాదాస్పదం అయిన జమ్మూ కాశ్మీర్ లో ముస్లీంల మీద హిందూ మతం రుద్దడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, అది ఆర్మీ బలగాలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలోని మసీదులోకి 50 మంది ఆర్ఆర్కు చెందిన ఆర్మీ దళాలు ప్రవేశించి అక్కడి ముస్లింలను జై శ్రీరాం అని నినాదాలు చేయమని బలవంతం చేశారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !
పీడీఎఫ్ నాయకురాలు మెహబూబా ముఫ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ప్రజలను రెచ్చగొట్టే లాగా ప్రవర్థిస్తున్నదని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మసీదులో బలవంతంగా చొరబడి జైశ్రీరామ్ అని నినాదాలు చెయ్యాలని బలవంతం చేసే విషయంపై దర్యాప్తు జరిపించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కి మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మనవి చేశారు.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ జూన్ 14వ తేదీన పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ (LoC) మరియు కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను అరికట్టడానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన శ్రీనగర్‌లోని చినార్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీకి నాయకత్వం వహించి అధికారులతో చర్చించారు. మాజీ సీఎం మెహబూబా
ముఫ్తీ ట్వీట్ చేస్తూ 50 ఆర్ఆర్కి చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి చొరబడి లోపల ఉన్న ముస్లింలను జై శ్రీరాం అని నినాదాలు చెయ్యాలని బలవంతం చేశారని, ఈ విషయం తాను విని షాక్ అయ్యానని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు.