పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 28:
తాడేపల్లిగూడెం పట్టణం లోచాలా కాలం గా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ను గాడిలో పెట్టాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ బుధవారం ఉదయం 31 వ వార్డు 32 వ వార్డు కడకట్ల ప్రాంతాల్లో వార్డు బాట చేపట్టారు. మున్సిపల్ సానిటరీ సిబ్బందిని వెంటబెట్టుకుని ఆయన డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. వెంటనే ఆయన మున్సిపల్ సానిటరీ సిబ్బందికి వర్కర్లకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచి దోమల నివారణకు చర్యలు తీసుకుంటామనితెలిపారు. ఆయన వెంట 32 వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నీలం నాగభూషణం ఉన్నారు.