Headlines

గ్రూప్ 2 ఎగ్జామ్ ఆ పద్ధతిలోనే నిర్వహిస్తాం : టీఎస్‌పీఎస్సీ

గ్రూప్-2 పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు(Group 2-OMR) ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) లో 150 ప్రశ్నలు (150 మార్కులు), పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)లో 150 ప్రశ్నలు (150 మార్కులు), పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్)లో 150 ప్రశ్నలు (150 మార్కులు), పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ)లో 150 ప్రశ్నలు (150 మార్కులు) ఉంటాయి.

 

గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆగస్టు 29, 30 తేదీల్లో సెలవులు ఉంటాయి. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.