Headlines

జగనన్న సురక్షతో సమస్యలు పరిష్కారం

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూలై 18:

: ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని పెద్దతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం అన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న సర్పంచ్ అన్నవరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి జగనన్న సురక్ష ఉపయోగపడుతుందన్నారు . సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ప్రజల అవసరాలు తెలుసుకుని అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు . నెలరోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవసరమైన ధ్రువ పత్రాలు అందించడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ప్రజలు అవసరాలను గుర్తించి వాటిని తీర్చడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని వారికి కావలసిన ధ్రువపత్రాలను ఉచితంగా పొందాలని సూచించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఏ. దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టిందన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించడం కుటుంబాల వారీగా వారికి అవసరమైన ధ్రువపత్రాలు ఉచితంగా ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. సుమారు 2000 కుటుంబాలు కలిగిన ఈ గ్రామంలో 5500 సర్టిఫికెట్లు జారీ చేయడం గర్వకారణమన్నారు. పెద్దతాడేపల్లి సోసైటీ చైర్మన్ పరిమి తులసీదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు జగనన్న సురక్ష శిబిరాలు అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించి వారి అవసరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. . ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్, ఈ ఓ ఆర్ డి వెంకటేష్ , పంచాయతీ కార్యదర్శి తల్లాప్రగడ రవిచంద్ర, , సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.