Headlines

ఈనెల 10 వ తారీకు జరగబోవు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా

యాడికి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు సర్పంచుల సమస్యలపై ఈనెల 10 వ తారీకు జరగబోవు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమ నికి గ్రామ సర్పంచులు వార్డు మెంబర్స్ ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపు ఇవ్వడం జరిగింది
బిజెపి మండల అధ్యక్షుడు పోట్టే గంగాధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం 14వ సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు కలిపి మొత్తం 6.950 కోట్లు రూపాయలు గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీలకు డబ్బు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను నవరత్నాలకు మళ్లించడం తొ రాష్ట్రంలో 80 శాతం పంచాయతీలు పారిశుద్ధ కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి సర్పంచులు వడ్డి డబ్బులు తెచ్చి మరి కాంట్రాక్టు పనులు పూర్తి చేసి సకాలంలో బిల్లులు అందక వడ్డీ భారం భరించలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ని అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పురందేశ్వరి గారు గ్రామ సర్పంచుల కొరకే సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తున్నారు అందుకే సర్పంచులు వార్డు మెంబర్లు రేపు పదో తారీకు జరగబోవు కలెక్టర్ ఆఫీస్ ధర్నాకు పెద్ద ఎత్తున సర్పంచులు వార్డ్ మెంబర్స్ నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి రావాలని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి పార్టీ పిలుపునివ్వడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఉపాధ్యక్షులు కేసు రఘువీరా చారి వద్ది రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చింత చౌడయ్య ఓబిసి మోర్చా అధ్యక్షుడు రంగస్వామి ప్రధాన కార్యదర్శి గుండా కృపాకర కార్యదర్శులు జక్క ప్రసాద్ రామకృష్ణ చంద్రమౌళి పాల్గొన్నారు