పుట్టపర్తి. న్యూస్ 9 . సెప్టెంబర్ 5.
టీడీపీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది.
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటేనే పేద ప్రజలకు మంచి జరుగు తుందని పుట్టపర్తి రూరల్ కన్వీనర్ విజయ్ కుమార్ అన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి రూరల్ మండలం నిడి మామిడి, కొట్లపల్లి, పెడబల్లి మరియు బత్తలపల్లిలో కన్వీనర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్ గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆన్లైన్లో అర్హులకు రిజిస్ట్రేషన్ చేయించి బాబు షూరిటీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.