జాతీయ భావం పెంపొందించేందుకు
నా మట్టి.. నా దేశం
– అమర వీరుల స్మారక వనం నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం
– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాధ రాజు
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 06:
దేశ స్వాంత్ర్యం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల స్మారకార్థం దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న అమృత వనం నిర్మాణంలో ప్రజలంతా భాగ స్వాములను చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విశ్వనాధ రాజు పేర్కొన్నారు. దేశప్రజల లో జాతీయ భావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలని లోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గృహంలో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వలసవాద భావం నుంచి విముక్తులను చేయడం , దేశ భక్తిని పెంపొదిం చే లక్ష్యం తో స్వాతంత్య్ర అమృతోత్సవ ముగింపులో కార్యక్రమాలను నిర్వహించ డం జరుగుతోందని వివరించారు. ఇంటింటా సేకరించిన మట్టి, బియ్యం కలశాలను ఢిల్లీ తరలిం చి అమృత వనం నిర్మాణంలో వినియోగిస్తార నీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మేరా మట్టి.. మేరా దేశ కార్యకరమ నికి మంచి స్పందన వస్తోంద నీ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నా ర్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈత కోట తాతాజీ, సుభాష్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అడపా రమేష్,ఇంతెలెక్సువల్ సెల్ జిల్లా కన్వీనర్ చిట్యాల రాంబాబు, మహిళా మో ఆర్చ్ జిల్లా అధ్యక్షురాలు ఐనo పూడి శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు నరీసే సోమేశవరరావు, కొండపల్లి నగేష్, ఓ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఐనo బాలకృష్ణ, ఎస్సీ మార్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేదపోలు వీర రాఘవులు, ఓ బిసి మార్చ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్నిటి వెంకట లక్ష్మీ, కో- కన్వీనర్ రామ గాని సత్యనారాయణ రాజకీయ వ్యవహారాల కన్వీనర్ కంచుమర్థి నాగేశ్వర రావు ఓ బిసి సెల్ జిల్లా కార్యదర్శి మారిశెట్టి నరసింహ మూర్తి, ఇమ్మాంది బెనర్జీ, పి రామ కృష్ణ,