లోకేష్..
దౌర్జన్యకాండ ఆపకపోతే తీవ్ర చర్యలు
– ఉప ముఖ్యమంత్రి కొట్టు హెచ్చరిక
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 06:
లోకేష్.. నీ పాదయాత్రలో దౌర్జన్యకాండ ఆపకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నారా లోకేష్ ను హెచ్చరించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర రక్తపాతాన్ని దౌర్జన్య కాండము సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ చర్యలు ఆపకపోతే ఖబర్దార్ ఈ జిల్లా ప్రజలు సహించరని తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తారని అయితే లోకేష్ కు అవగాహన లేకుండా సైకోల ప్రవర్తిస్తూ సైకిల్ యాత్ర చేస్తున్నారని విమర్శించారు పాదయాత్రలో ఎవరు కష్టాలు తెలుసుకున్నామని మంత్రి కొట్టు ప్రశ్నించారు .మందలపరులో దౌర్జన్యం చేసి భీమవరంలో బీభత్సం సృష్టించావని తెలిపారు గుండాలతో పోలీసులుపై తిరుగుబాటు చేస్తున్నావని పాదయాత్ర ద్వారా దౌర్జన్యం చేయడానికి వచ్చావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పచ్చని పశ్చిమగోదావరిలో పాదయాత్ర చేయడానికి వచ్చి ఏం వివరాలు తీసుకున్నామని ఐదుగురు మంత్రులు ఉన్నారని చెబుతున్నామని కనీస అవగాహన లేకుండా పాదయాత్ర చేయడం సిగ్గుచేటు అన్నారు జిల్లా ప్రజలు నీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు పోలీసులు కాపుదల ఇస్తుంటే వారిపైనే దాడులు చేస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి శృతిమించితే పోలీసులే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు లోకేష్ పాదయాత్రలో పాల్గొనే వారి బయోడేటాలు ఆధార్ కార్డులు పరిశీలించాలని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ను, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ను కోరారు. నేర ప్రవృత్తి ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చివరి దశలో ఉందని తెలిపారు. పాదయాత్రలో రాళ్లు కర్రలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు ప్రవర్తన మార్చుకోకపోతే పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ పాదయాత్రలో మారణకాండ ఆపకపోతే జిల్లా ప్రజలే తిరగబడతారని తెలిపారు.
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడిన విషయమై జైలుకెళ్లడం ఖాయమని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. 118 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్లు ఇన్కమ్ టాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు త్వరలో సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు రంగప్రవేశం చేయనున్నాయని తెలిపారు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లడం చంద్రబాబు వల్లే జరిగిందని చెప్పారు. స్టే తెచ్చుకుని అరెస్టు కాకుండా ముందుకు వెళ్లడం అంటే తప్పు చేసినట్లే కదా అని ఒక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.