పుట్టపర్తి,న్యూస్ 9, అక్టోబర్ 2.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి విగ్రహానికి పూలమాలయ వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం నారాచంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గాంధీజీ గారి విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మౌన దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలియజేసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఈ సందర్భంగా స్థానికంగా సోమవారం నాడు జనం కోసం జన్మించిన మహాత్ముడు,దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారి విగ్రహం నందు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ అనంతరం ఆయన మాట్లాడుతూ… అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు,యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత,జాతిపిత మహాత్మ గాంధీ అన్నారు,ఐక్యత,సమగ్రత,అభివృద్ధి వైపు పయాణానికి గాంధీ మార్గమని,కమ్మగా బతికితే గాంధీయుగంమని,భారత జాతికి అంత ఉత్తమమైన మార్గనిర్దేశనం చేసిన మహాత్ముని జయంతి రోజును ప్రపంచం మొత్తం అంతర్జాతీయ ఆహింసా దినోత్సవంగా జరుపుకుంటుందని,అనంతరం గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే అనే నినాదంతో వైసీపీ ప్రభుత్వ అక్రమ అరెస్టును నిరసిస్తూ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న నారా చంద్రబాబునాయుడు గారు కూడా జ్యుడీషియల్ రిమాండ్ లోనే రిలే నిరాహార దీక్ష కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారని బాబు గారు, మరియు నారాభువనేశ్వరి గారు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా ఈరోజు గాంధీ విగ్రహం మధ్యలో నిరసన వ్యక్తం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలు,టౌన్ అధ్యక్షుడు జంగం వెంకట్రాముడు,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షురాలు యశోద రాయుడు,మహిళా నాయకురాలు లావణ్య గౌడ్,తెలుగు యువత ఉపాధ్యక్షులు బుల్లె సుధీర్,మైనార్టీ నాయకులు షామీర్ భాష,సయ్యద్ బాషా,మైనార్టీ ఫోక్ పర్సన్ వాజీద్ భాష,మాజీ వైస్ పర్సన్ ఎంపీపీ బండి నారాయణస్వామి,క్యాంటీన్ రవి,ఎస్సీ నాయకులు మల్లికార్జున,కిష్టప్ప,కేశప్ప సామకోటి ఈశ్వరయ్య,పీట్ల రమణ,కేశప్ప,అంజి,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.