Headlines

కళ్ళకు గంతలు కట్టుకుని నిరాహార దీక్ష

 

పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 05:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నాయకులు గురువారం కళ్ళకు గంతలు కట్టుకుని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత కొన్ని రోజులుగా నియోజవర్గ ఇన్చార్జ్ వలవల మల్లికార్జున రావు (బాబ్జి) నేతృత్వంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం జరుగుతుంది. మండలంలోని జగన్నాధపురం, మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు నిరసన దీక్షలో పాల్గొని అధికార ప్రభుత్వ వైఖరిని ఖండించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముత్యాల సత్యనారాయణ, వాడపల్లి సుబ్బరాజు, పొనుకుమాటి గౌరీ గంగరాజు, కాకర్ల కిట్టు, గూడవల్లి శ్రీను, వెలిగట్ల రాము, బొల్లిన రామకృష్ణ , రాచర్ల ప్రసాద్, గన్నమనేని శ్రీనివాస్, పాశం పాండు, మర్లపాడు సుబ్బలక్ష్మి, బల్లి ప్రసాద్, గడ్డం రాజ్ కుమార్, పెనుమర్తి పాపారావు, చెరుకూరు కొండలరావు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, జిల్లా నాయకులు పద్మనాభం మురళి, ఆకాశం స్వామి ముప్పిడి రమేష్, ఎరువు బండి సతీష్ ,పసలపూడి రాంబాబు, గరపాక మూర్తి ,బాదంపూడి రామకృష్ణ తదితరులు ఉన్నారు