యాడికి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా, మండల ఇన్చార్జిగా నేడు అనంతపురంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య అధ్యక్షతన నేడు మండల కన్వీనర్ గా బొంబాయి రమేష్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జిగా తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పైల నరసింహ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు తెలియజేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు…